శీతాకాలపు పంటలు కోసే సమయం దగ్గరపడినందున, కృష్ణ అంబుల్కర్ ప్రతి రోజూ ఉదయం 7 గంటలకు ఇంటింటికీ వెళ్ళి ఆస్తి పన్ను, నీటి పన్నుల వసూలీని ప్రారంభిస్తారు.
"ఇక్కడి రైతులు ఎంత పేదవాళ్ళంటే, 65 శాతం లక్ష్యాన్ని సాధించటమే ఇక్కడ చాలా గొప్ప," అంటారు ఝమ్కోలీ పంచాయతీకి చెందిన ఈ ఒకే ఒక ఉద్యోగి.
ఝమ్కోలీ నాగపూర్ నుండి 75 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ నివసించే మానా, గోవారీ (షెడ్యూల్డ్ తెగలు) సముదాయాలవారు ఎక్కువగా మెట్ట పొలాలను సాగుచేసే సన్నకారు, చిన్న రైతులు. ఈ రైతులు పత్తి, సోయాచిక్కుళ్ళు, తూర్ (కందులు) పండిస్తారు. తమ పొలంలో బావి లేదా బోర్వెల్ ఉంటే గోధుమలు కూడా పండిస్తారు. నలభై ఏళ్ళ వయసున్న కృష్ణ ఈ గ్రామంలో ఉన్న ఏకైక ఒబిసి - న్హావీ (మంగలి) కులానికి చెందినవారు.
ఈ ఏడాది వ్యవసాయాన్ని కేంద్రంగా ఉంచుతూ బడ్జెట్ను రూపొందించినట్లు కొత్త దిల్లీ చేస్తోన్న బూటకపు వాదనలు, మధ్యతరగతివారికి ఇచ్చిన పన్ను మినహాయింపుపై మితిమీరిన ఉత్సాహం చెలరేగుతోన్నన్నప్పటికీ, అంబుల్కర్ పంచాయతీ పన్నుల వసూలు గురించిన ఆందోళనలో ఉన్నారు. మరోవైపు పంటలకు గిట్టుబాటు ధర మందగించడంపై ఆ గ్రామ రైతులు ఆందోళన చెందుతున్నారు.
కృష్ణ ఆందోళనను సులభంగా అర్థంచేసుకోవచ్చు: పన్నుల వసూలులో అతను విఫలమైతే, పచాయితీ పన్నుల రాబడి రూ. 5.5 లక్షల నుంచి అతనికి రావలసిన జీతం రూ. 11,500 అతనికి రాదు.




