సాంస్కృతిక జ్ఞానాన్ని, సామాజిక కట్టుబాట్లని ఎల్లప్పుడూ తన భుజాలపై మోస్తూ వస్తున్న శక్తి, జానపద గీతం. అదే జానపదం సాంస్కృతిక మార్పు కోసం, అవగాహనను కల్పించడానికి కూడ ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. ఈ కళా ప్రక్రియకు గల ఈ ఒదుగుబాటు - జానపద సంగీతానికున్న మౌఖికత (నోటిమాటల్లో వెల్లడిచేయగల శక్తి), ప్రతీ ప్రదర్శనకూ అనుగుణంగా మారగలిగే దాని సమర్థత, ఆ సముదాయపు సంస్కృతితో నాటుకుపోయిన అనుబంధం - వీటి నుండి వచ్చింది.
జానపద సంగీతానికి గల ఈ పునరుజ్జీవింపజేసే శక్తిని ఈ పాట ఇక్కడ ఉపయోగించుకుంటోంది, అవగాహన సందేశాన్ని తెలియజేస్తోంది. ఈ సందర్భంలో, గ్రామీణ మహిళల జీవితాలను చుట్టుముట్టే లింగ ఆధారిత వాస్తవికతను తెలియచేస్తోంది. కచ్ఛ్ ప్రాంతానికి చెందిన మహిళా కళాకారులు పాడిన ఈ పాట సామాజిక విమర్శను భావోద్వేగ నివేదనగా ప్రతిపాదిస్తోంది.
ఈ పాటలోని ప్రత్యేక ఆకర్షణ, నేపథ్యంలో వినపడుతోన్న జోడియా పావా లేదా అల్ఘోజా అనే వాయిద్యం. ఇది సంప్రదాయంగా, పాకిస్తాన్ లోని సింధ్, భారతదేశంలోని కచ్ఛ్, రాజస్థాన్, పంజాబ్ వంటి వాయవ్య ప్రాంతాలకు చెందిన కళాకారులు వాయించే జంట వేణువుల వాయు వాయిద్యం
કચ્છી
પિતળ તાળા ખોલ્યાસી ભેણ ત્રામેં તાળા ખોલ્યાસી,
બાઈએ જો મન કોય ખોલેં નાંય.(૨)
ગોઠ જા ગોઠ ફિરયાસી, ભેણ ગોઠ જા ગોઠ ફિરયાસી,
બાઈએ જો મોં કોય નેરે નાંય. (૨)
પિતળ તાળા ખોલ્યાસી ભેણ ત્રામે તાળા ખોલ્યાસી,
બાઈએ જો મન કોય ખોલે નાંય. (૨)
ઘરજો કમ કરયાસી,ખેતીજો કમ કરયાસી,
બાઈએ જે કમ કે કોય લેખે નાંય.
ઘરજો કમ કરયાસી, ખેતીજો કમ કરયાસી
બાઈએ જે કમ કે કોય નેરે નાંય
ગોઠ જા ગોઠ ફિરયાસી, ભેણ ગોઠ જા ગોઠ ફિરયાસી,
બાઈએ જો મોં કોય નેરે નાંય.
ચુલુ બારયાસી ભેણ,માની પણ ગડયાસી ભેણ,
બાઈએ કે જસ કોય મિલ્યો નાંય. (૨)
ગોઠ જા ગોઠ ફિરયાસી ભેણ ગોઠ જા ગોઠ ફિરયાસી,
બાઈએ જો મોં કોય નેરે નાંય. (૨)
સરકાર કાયધા ભનાય ભેણ,કેકે ફાયધો થ્યો ભેણ,
બાઈએ કે જાણ કોઈ થિઈ નાંય (૨)
ગોઠ જા ગોઠ ફિરયાસી ભેણ ગોઠ જા ગોઠ ફિરયાસી,
બાઈએ જો મોં કોય નેરે નાંય (૨)
తెలుగు
ఇత్తడి తాళాలు తెరవగలిగారు; రాగి మొహరును కూడా తెరిచారు
కానీ ఆమె గుండె గది తలుపులను తెరవ ఎవరి తరమూ కాలేదు
మగువ మది మాటున మెదిలే భావాలను ఎవరూ తాకలేకున్నారు. (2)
గ్రామ గ్రామాలను చుట్టబెడుతుంటారు
రేయి పగలు పరదా మాటున పడివుండే
తన మోమును మటుకు గమనించకున్నారు (2)
ఇత్తడి తాళాలు తెరవగలిగారు; రాగి మొహరును కూడా తెరిచారు
కానీ ఆమె గుండె గది తలుపులను తెరవ ఎవరి తరమూ కాలేదు
మగువ మది మాటున మెదిలే భావాలను ఎవరూ తాకలేకున్నారు.(2)
ఇంట్లో చాకిరి చేస్తాం; పొలాల్లో చెమటోడుస్తాం
కాని మా పనులను పరామరిక చేసేదెవరు?
గ్రామ గ్రామాలను చుట్టబెడుతుంటారు
రేయి పగలు పరదా మాటున పడివుండే
తన మోమును మటుకు గమనించకున్నారు (2)
మీ పొయ్యి మంటలు వెలిగించేది మేము, రొట్టెలనొత్తేదీ మేమే
కానీ, మహిళ శ్రమకెన్నడూ అభినందనలు లేవు
ఒక్కరు, ఏ ఒక్కరూ ఆమె ప్రయాసలకు ప్రశంసలనివ్వరు (2)
గ్రామ గ్రామాలను చుట్టబెడుతుంటారు
రేయి పగలు పరదా మాటున పడివుండే
తన మోమును మటుకు గమనించకున్నారు (2)
వ్యవస్థ కొత్త చట్టాలు చేస్తుంది.
కానీ, ఓ చెల్లే! మళ్ళీ ఎవరికి లాభం చెప్పు?
మాకు, మహిళలకు, తెలియజేసేవారెవరూ లేరు (2)
గ్రామ గ్రామాలను చుట్టబెడుతుంటారు
రేయి పగలు పరదా మాటున పడివుండే
తన మోమును మటుకు గమనించకున్నారు (2)
పాట స్వరూపం : అభ్యుదయం
శ్రేణి : స్వేచ్ఛ, చైతన్యం గురించిన పాటలు
పాట : 8
పాట శీర్షిక: పిత్తల్ తాలా ఖొలాసీ, ట్రామెన్ తాలా ఖొల్యాసీ
స్వరకర్త : దేవల్ మెహతా
గానం : కచ్ఛ్, అహమ్మదాబాద్‌లకు చెందిన కళాకారులు
ఉపయోగించిన వాయిద్యాలు : డ్రమ్, హార్మోనియం, తంబూరా, జోడియా పావా (అల్ఘోజా)
రికార్డ్ చేసిన సంవత్సరం : 1998, కెఎమ్‌విఎస్ స్టూడియో
ఈ 341 పాటలు, సామాజిక రేడియో సూర్‌వాణి ద్వారా రికార్డ్ చేసినవి. కచ్ మహిళా వికాస్ సంఘటన్ (కెఎమ్‌విఎస్) ద్వారా PARIకి లభించాయి.
ప్రీతి సోనీ, కెఎమ్‌విఎస్ కార్యదర్శి అరుణా ఢోలకియా, కెఎమ్‌విఎస్ ప్రాజెక్ట్ సమన్వయకర్త అమద్ సమేజాల సహకారానికి; గుజరాతీ అనువాదంలో అమూల్యమైన సహాయం చేసినందుకు భారతీబెన్ గోర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు.
అనువాదం: నిహారికా రావ్ కమలం