గ్రామీణ భారతదేశంలోని క్వీర్ ప్రజల రోజువారీ జీవితాలు
ప్రైడ్ నెలలో, PARI లైబ్రరీ పెద్ద మెట్రోలకు, నగరాలకు దూరంగా నివసిస్తోన్న క్వీర్ కమ్యూనిటీవారి జీవితాలను, డేటాను వెలుగులోకి తెస్తోంది, వారి గొంతులను వినిపిస్తోంది. వారి వ్యక్తిగత, వృత్తిగత జీవితాలలో ఎదుర్కొంటోన్న సామాజిక బహిష్కరణను గురించి తెలియజేస్తోంది
జూన్ 27, 2023| PARI గ్రంథాలయం
ధర్మశాలలో స్వాభిమాన యాత్ర
క్వీర్ సముదాయపు హక్కుల కోసం హిమాచల్ ప్రదేశ్‌లో నిర్వహించిన స్వాభిమాన యాత్ర రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల నుంచీ, చిన్న పట్టణాలనుంచీ అనేక మంది ప్రజలను ఒకదగ్గరకు చేర్చింది
జూన్ 7, 2023 | శ్వేత డాగా
ట్రాన్స్ సముదాయపు నాటకరంగ ఆవిష్కరణ
ట్రాన్స్‌జెండర్ సముదాయానికి నాటకరంగంపై నటించే అవకాశం రావటం చాలా అరుదు. మార్చి 31న జరిగే ఇంటర్నేషనల్ ట్రాన్స్‌జెండర్ డే ఆఫ్ విజిబిలిటీ సందర్భంగా, సండకారంగా నాటకం ఛాయాచిత్ర కథనం – ట్రాన్స్‌జెండర్ సముదాయపు జీవితాల గురించి, వివక్షకు వ్యతిరేకంగా వారు చేస్తున్న పోరాటాల గురించి ఒక నాటకం
మార్చి 32, 2023 | ఎమ్. పళని కుమార్
ప్రేమ, మహానగరంలో ఉండడానికొక సొంత తావు…
సామాజిక అంగీకారం, న్యాయం, గుర్తింపుతో భవిష్యత్తులో కలిసి జీవించడం కోసం పోరాడుతున్న గ్రామీణ మహారాష్ట్రకు చెందిన ఒక యువతి, ఒక ట్రాన్స్ మ్యాన్ తమ ప్రేమ కథను ఇలా పంచుకున్నారు
జనవరి 4, 2023 | ఆకాంక్ష
'భారతదేశం కోసం ఆడే అవకాశం మళ్ళీ నాకెప్పుడూ రాలేదు'
పశ్చిమ బెంగాల్‌కు చెందిన బోనీ పాల్‌ను తన అనిశ్చిత లైంగికత్వం (ఇంటర్‌సెక్స్) కారణంగా అంతర్జాతీయ స్థాయిలో ఫుట్‌బాల్ ఆడకుండా నిలిపివేశారు. ఏప్రిల్ 22, జాతీయ అనిశ్చిత లైంగికత్వ (ఇంటర్‌సెక్స్) మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా అతను తన గుర్తింపు గురించీ, చేసిన పోరాటాల గురించీ గుర్తుచేసుకుంటున్నారు
ఏప్రిల్ 22, 2022 | రియా బెహల్
వేధింపులు, బెదిరింపులు, ఒంటరితనంతో బాధపడుతున్న మదురైలోని ట్రాన్స్ కళాకారులు
వేధింపులకు గురై, కుటుంబ సభ్యులతో వెళ్ళగొట్టబడి, జీవనోపాధిని కోల్పోయిన తమిళనాడులోని ట్రాన్స్ ప్రజలు అత్యంత దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు
జూలై 29, 2021 | ఎస్. సెందళిర్
మదురై లో జానపద ట్రాన్స్ కళాకారుల విషాదం
తమిళనాడు అంతటా మహారోగం చాలా మంది జానపద కళాకారులను నాశనం చేసినప్పటికీ, ట్రాన్స్ మహిళా కళాకారిణులు తీవ్రంగా నష్టపోయారు - వారికి పని దొరకడం లేదు, ఆదాయం లేదు, రాష్ట్ర ప్రభుత్వం నుండి సహాయం కూడా లేదు
జూలై 27, 2021 | ఎస్. సెందళిర్
'మేమేదో దుష్టశక్తులమైనట్టు జనం మమ్మల్ని మిటకరించి చూస్తుంటారు’
ఇచల్కరంజి పట్టణంలోని ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు తమ ఇళ్ళల్లో, చదువుకునే బడుల్లో, ఇంటా బయటా - ఇలా ప్రతిచోటా వివక్షను ఎదుర్కొంటుంటారు. వారు సాధారణ వ్యక్తులుగా కనిపించడానికీ, కొంత గౌరవనీయమైన పనిని వెదుక్కోవడానికీ కష్టపడుతుంటారు