వేధింపులకు వ్యతిరేకంగా వోటు వేసిన ట్రాన్స్‌ మహిళలు

వారణాసిలో శాంతి భద్రతలు ట్రాన్స్ మహిళల హక్కులను పరిరక్షించటంలోనూ వారికి భద్రత కల్పించటంలోనూ అనేకసార్లు విఫలమయ్యాయి. 2024 సార్వత్రిక ఎన్నికలలో వారు మార్పు కోసం వోటు వేశారు

జూన్ 26, 2024 | జిజ్ఞాస మిశ్రా

భవిష్యత్ తెలియని దినసరి కూలీలు

అది ఝార్ఖండ్‌లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ప్రకటించిన జూన్ 4, 2024 మరుసటి రోజు ఉదయం. కానీ డాల్టన్‌గంజ్‌లోని లేబర్ మార్కెట్‌లో పనుల కొరత తీరడం లేదని కార్మికులు అంటున్నారు

జూన్ 11, 2024 | అశ్విని కుమార్ శుక్లా

మార్పు కోసం వోటు వేసిన రోహ్‌తక్ శ్రామికులు

ఒక శతాబ్దాని కంటే ముందు, హరియాణాలోని ఈ తహసీల్ భారత స్వాతంత్ర్య పోరాట ఉద్యమంలో ఒక మైలురాయిగా నిలిచింది. ఈరోజు, ఈ ప్రాంతంలోని శ్రామికులు 2024 సార్వత్రిక ఎన్నికల గురించి తమ భావాలను పంచుకుంటున్నారు

జూన్ 9, 2024 | ఆమిర్ మాలిక్

సరిహద్దుల చిక్కుల్లో చిక్కుకుపోయిన అట్టారీ-వాఘా కూలీలు

వోటర్లంతా తమ సమస్యలను దిల్లీకి తీసుకు వెళ్ళగలిగే శక్తి ఉన్న పార్లమెంటు సభ్యులనే కోరుకుంటారు. భారతదేశానికి పాకిస్తాన్‌తో ఉన్న అత్యంత సున్నితమైన సరిహద్దు వద్ద పని లేకుండాపోయిన కూలీలు, 2024 సార్వత్రిక ఎన్నికలలో తమ ఓటు ఆ పని చేస్తుందని ఆశిస్తున్నారు

జూన్ 7, 2024 | సంస్కృతి తల్వార్

మాదకద్రవ్య రహిత గ్రామం కావాలని కోరుకుంటోన్న నంగల్ మహిళలు

పంజాబ్‌లోని మోగా జిల్లాలో హెరాయిన్, ఇతర మాదకద్రవ్యాలు పిల్లల పెద్దల ప్రాణాలను బలిగొంటున్నాయి. దీంతో మహిళలు, అసలే తక్కువగా ఉన్న ఉద్యోగాల వేటలో ఉన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలలో పంజాబ్‌లో ఇదొక ప్రధాన సమస్యగా ఉంది

మే 31, 2024 | సంస్కృతి తల్వార్

'నేను ఒకప్పుడు దేశ నిర్మాణం కోసం వోటేశాను... ఇప్పుడు దాన్ని రక్షించటం కోసం వోటేస్తున్నాను’

భారతదేశపు మొట్టమొదటి ఎన్నికలలో వోటేయడాన్ని ఖ్వాజా మొయీనుద్దీన్ (92) గుర్తుచేసుకున్నారు; ఆయన 2024 సార్వత్రిక ఎన్నికలలో కూడా వోటేశారు. మహారాష్ట్రలోని బీడ్‌లో నివాసముండే ఆయన మన లౌకిక ప్రజాస్వామ్యం భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల గురించి మాట్లాడారు

మే 30, 2024 | పార్థ్ ఎమ్.ఎన్.

‘నిద్రలో కూడా నేను దుమ్మును పీల్చాను’

పశ్చిమ బెంగాల్‌, ఉత్తర 24 పరగణా జిల్లాలోని సందేశ్‌ఖాలీ, మినాఖాఁ బ్లాక్‌ల నుంచి వలస కార్మికులు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలోని ర్యామింగ్ మాస్ యూనిట్లలో పని చేయడానికి వెళ్ళారు. కొన్ని సంవత్సరాలకు వాళ్ళు తిరిగి వచ్చాక, వారికి సిలికోసిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. 2024 సార్వత్రిక ఎన్నికలు తమ బ్రతుకులనేమీ మార్చలేవని వాళ్ళు అంటున్నారు

మే 29, 2024 | ఋతాయన్ ముఖర్జీ

'మనం వోటెందుకు వెయ్యాలమ్మా?'

మన ప్రజాస్వామ్యంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతోన్న వేళ, ఎన్నికల్లో సామాన్య ప్రజల హక్కుల గురించి తప్ప ఇతర విషయాలన్నీ ఎలా ముందుకు వస్తాయో ఓ కవి గుర్తు చేస్తున్నారు

మే 28, 2024 | మౌమితా ఆలమ్

కృష్ణాజీవారి భరిత్‌ తయారీలో చేయి తిరిగిన జళగావ్ మహిళలు

వంకాయలతో తయారుచేసే ఈ ప్రత్యేక వంటకం (భరిత్), మహారాష్ట్రలోని ఈ నగరంలో స్థానికంగా తయారుచేసే ఒక రుచికరమైన వంటకం. కొన్ని రోజులలో 500 కిలోగ్రాముల వరకూ కూడా ఈ వంటకాన్ని తయారుచేసే 14 మంది మహిళలు 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ప్రధాన పాత్రను పోషిస్తున్నారు

మే 28, 2024 | కవిత అయ్యర్

వోటింగ్ సమీపిస్తుండగా పంజాబ్ రైతులకిది లెక్కలు తేల్చుకోవాల్సిన సమయం

2020లో, నిరసన తెలుపుతోన్న రైతులను దిల్లీలోకి ప్రవేశించకుండా పాశవిక బలప్రయోగంతో నిరోధించడాన్ని దేశం నివ్వెరపోయి చూసింది. ఈ రోజు పంజాబ్ ఎన్నికల ప్రచారంలో, రైతులు ఆ లెక్కలను అహింసా మార్గంలో తేల్చుకుంటున్నారు

మే 26, 2024 | విశ్వ భారతి
బ్రెయిలీ - బ్యాలట్
, , , and • Kolkata, West Bengal

బ్రెయిలీ - బ్యాలట్

వికలాంగులు వోటు వేసేలా రాజ్యం ఏర్పాట్లు చేసినప్పటికీ, బబ్లూ కైబర్తా వంటి కొందరికి 2024 సార్వత్రిక ఎన్నికల ఎన్నికల ప్రక్రియల్లో పాల్గొనడం గురించి ఖచ్చితంగా తెలియదు

మే 24, 2024 | సర్వజయ భట్టాచార్య

చదువులు ఉన్నా ఉద్యోగాలు రాక అవివాహితులుగా మిగిలిపోతున్న యువ రైతులు

యవత్మాల్‌లో, ఆ మాటకొస్తే మహారాష్ట్రలోని దాదాపు గ్రామీణ ప్రాంతమంతటా, ఇప్పుడు 'వివాహ'సంక్షోభం నెలకొని ఉంది. యువకులకు వధువులు దొరకడంలేదు. యువతులు పేదవారైన రైతులను కాకుండా, ప్రభుత్వ ఉద్యోగులనే పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారు. ఇది వ్యవసాయ ఆదాయాలు తగ్గిపోయినదాని ప్రత్యక్ష ఫలితం. 2024 సార్వత్రిక ఎన్నికలు జరుగుతోన్న నేపథ్యంలో, వ్యవసాయ ఆదాయాలు పడిపోవడం, వివాహ అవకాశాలు అంతంత మాత్రంగానే ఉండడం తమ ప్రధాన సమస్యలని ఇక్కడి యువత అంటున్నారు

మే 22, 2024 | జైదీప్ హర్దీకర్

ముర్షిదాబాద్‌లో: పొట్టకూటి తర్వాతే వోటైనా, భాషైనా, మరేదైనా...

పశ్చిమ బెంగాల్‌, ముర్షిదాబాద్ జిల్లాలోని ఉల్లి పొలాల్లో పనిచేస్తోన్న మాల్ పహాడియా ఆదివాసీ మహిళలు లోక్‌సభ ఎన్నికల సందర్భంగా PARIకి తమ ప్రాధాన్యాలను ఇలా వివరిస్తున్నారు - పని, ఆహారం, ఆపైనే వోటు

మే 21, 2024 | స్మిత ఖటోర్

2024లో వోటు వేసిన స్వాతంత్ర్య సమరయోధురాలు భవానీ మహాతో

ధీర, నిగర్వీ అయిన భవానీ మహాతో, భారతదేశ స్వాతంత్ర్యం కోసం దశాబ్దాల పాటు సాగిన చారిత్రాత్మక పోరాటంలో తన కుటుంబం కోసం, ఇతర విప్లవకారుల కోసం కూడా వ్యవసాయం చేసి, వంటచేసి, ఆహారాన్ని అందించారు. ప్రస్తుతం సుమారు 106 సంవత్సరాల వయస్సున్న ఆమె తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు... 2024 సార్వత్రిక ఎన్నికలలో ఆమె తన ఓటు వేశారు

మే 20, 2024 | పార్థసారథి మహతో

ప్రజాస్వామ్యానికి వోటేయనున్న దాము నగర్

ఉత్తర ముంబై పార్లమెంటరీ నియోజకవర్గం లోని దాము నగర్ మురికివాడ నివాసులకు 2024 సార్వత్రిక ఎన్నికలలో ఓటేయటమంటే అట్టడుగువర్గాల హక్కుల పరిరక్షణకు ఓటేయటమే

మే 19, 2024 | జ్యోతి శినోలి

ప్రజాస్వామ్యం ఓడిపోతే, అట్టడుగు వర్గాలన్నీ నష్టపోతాయి

2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో క్వీర్ కమ్యూనిటీ సభ్యులు ప్రచారానికి వెళ్ళినప్పుడు, బిజెపి పార్టీ మద్దతుదారులు వారిని, ఈ ఈవెంట్‌ను కవర్ చేస్తోన్న జర్నలిస్టును ఎగతాళి చేస్తూ బెదిరించారు

మే 16, 2024 | శ్వేత డాగా

‘అనుమానాస్పద వోటర్లు’: ఇక్కడా అక్కడా ఎక్కడా లేరు!

అనుమానాస్పద వోటర్ల (డి-వోటర్లు) విభాగం కేవలం అస్సామ్‌కు మాత్రమే ప్రత్యేకం. ఇక్కడ బంగ్లా మాట్లాడే అనేకమంది హిందువులకు, ముస్లిములకు తరచుగా ఓటు హక్కును నిరాకరించారు. జీవితకాలమంతా అస్సామ్‌లోనే గడచిపోయినా మర్జినా ఖాతూన్, మరోసారి, 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయలేకపోయారు

మే 15, 2024 | మహిబుల్ హక్

నూట ఎనిమిది అడుగుల సాంబ్రాణి కడ్డీ

దైవమందిరంలో భగవంతుడి గురించీ ఆయన మహత్తు గురించీ జరిగిన సంరంభం అంతా ముగిసిపోయి చాలా కాలం గడిచాక, ఒక కవి రాసిన పదునైన, హాస్యస్ఫోరకమైన ఈ లిమరిక్కులు, ఈ దేశ సామాజిక సమ్మేళనం ఎట్లా మారిపోతున్నదో వాస్తవాన్ని గుర్తించమని మనను ఒత్తిడి చేస్తున్నాయి

మే 12, 2024 | జాషువా బోధినేత్ర

రాజకీయ నాయకులెవ్వరూ సందర్శించని గ్రామం

సాత్పురా పర్వతాల రాతివాలులలో ఒదిగివుండే అంబాపాణీ కుగ్రామంలో ప్రజాస్వామ్య సారం పట్టుచిక్కకుండా ఉంది -- 2024 సార్వత్రిక ఎన్నికలలో ఈ గ్రామవాసులు వోటు వేయగలరు, కానీ వారికి రహదారులు గానీ విద్యుత్ గానీ ఆరోగ్య సంరక్షణా సౌకర్యాలు గానీ లేవు

మే 11, 2024 | కవిత అయ్యర్

'మా గ్రామానికి మీరేం చేశారు?'

ఎమ్ఎన్ఆర్ఇజిఎ, ఉచిత ఎల్‌పిజి సిలిండర్లు వంటి ప్రభుత్వ పథకాలు, రోడ్లు, చేతిపంపులు వంటివన్నీ ఝార్ఖండ్ రాష్ట్రం, పలామూ జిల్లాలోని దళితులు ఎక్కువగా నివసించే చెచరియా గ్రామానికి ఎన్నడూ చేరలేదు. తమ దుస్థితికి కోపం వచ్చి, విసిగిపోయిన వారు 2024 సార్వత్రిక ఎన్నికలను లెక్కలు తేల్చుకోవాల్సిన సమయంగా పరిగణిస్తున్నారు

మే 10, 2024 | అశ్విని కుమార్ శుక్లా

'మాకేది అవసరమో, ఏం కావాలో మమ్మల్ని అడగండి’

మహారాష్ట్రలోని గడ్‌చిరోలి జిల్లాలోని అటవీ ప్రాంతాలలో ఉన్న ఇనుప ఖనిజపు గనులు ఆదివాసీ ప్రజల ఆవాసాలను, సంస్కృతిని నాశనం చేశాయి. కొన్ని సంవత్సరాలుగా, ఈ ప్రాంతంలో రాజ్య భద్రతా బలగాలకూ, సిపిఐ (మావోయిస్ట్)లకూ మధ్య వైరం కొనసాగుతూ ఉంది. ఈ ఏడాది 2024 సార్వత్రిక ఎన్నికలలో ఆదివాసీ ప్రాంతంలోని సుమారు 1,450 గ్రామసభలు కాంగ్రెస్ అభ్యర్థికి తమ షరతులతో కూడిన మద్దతును ప్రకటించాయి. అలా ఎందుకంటే...

మే 8, 2024 | జైదీప్ హర్దీకర్

వోటు వేయలేకపోతున్న రాయపుర్ ఇటుక బట్టీల కార్మికులు

మధ్యప్రదేశ్ నుంచి వచ్చి, ఛత్తీస్‌గఢ్‌లో పనిచేసే ఈ శ్రామికులకు తమ స్వంత నియోజకవర్గాల పోలింగ్ తేదీల గురించి తెలియదు. అందువలన ఈ 2024 సార్వత్రిక ఎన్నికలలో వారు వోటు వేసే అవకాశం లేదు

మే 7, 2024 | పురుషోత్తం ఠాకూర్

మతసామరస్యానికి ప్రతీకగా నిలబడ్డ మళగావ్‌

శతాబ్దాల తరబడి అనేక మతాలకు చెందిన ప్రజలు పూజలు చేస్తోన్న ప్రార్థనాస్థలాలపై హిందూ మూకలు దాడి చేస్తున్నాయి. అయితే వాటికి గట్టిగా ఎదురు నిలబడిన ఓ గ్రామం, సమకాలిక జీవన విధానాలను ఇప్పటికీ ఎలా పునరుద్ధరించవచ్చో చూపిస్తోంది

ఏప్రిల్ 28, 2024 | పార్థ్ ఎమ్.ఎన్.

ఎన్నికలను బహిష్కరిస్తోన్న ఒక గ్రామం

మహారాష్ట్ర, అమరావతి జిల్లాలోని ఖడిమాల్ గ్రామానికి విద్యుత్, నీటి సౌకర్యాలు అసలే లేవు. రాజకీయనాయకులు ప్రతి ఐదేళ్ళకొకసారి వచ్చి అబద్ధపు వాగ్దానాలు చేసి మాయమవుతుంటారని గ్రామస్థులు చెప్పారు. దాంతో వాళ్ళు 2024 సార్వత్రిక ఎన్నికలలో వోటు వేయకూడదని సమష్టిగా నిర్ణయించుకున్నారు

ఏప్రిల్ 26, 2024 | స్వర గార్గ్, ప్రఖర్ దోభల్

‘ద్రవ్యోల్బణం ఇప్పటికే నెత్తిన ఉంది; ఇప్పుడు ఏనుగులు కూడా వచ్చిపడ్డాయి’

ఈ వేసవికాలంలో, మహారాష్ట్రలోని ఆదివాసీ గ్రామమైన పళస్‌గావ్ గ్రామస్థులు ఊహించని విధంగా వచ్చిపడిన ముప్పు కారణంగా తమ అటవీ ఆధారిత జీవనోపాధిని వదులుకుని ఇళ్ళలోనే ఉండిపోతున్నారు. తమ జీవితాల గురించి ఎంతో అందోళనపడుతోన్న వీరు 2024 సార్వత్రిక ఎన్నికల గురించి ఎంతమాత్రం ఉత్సాహంగా లేరు

ఏప్రిల్ 25, 2024 | జైదీప్ హర్దీకర్

భండారాలో దురదృష్టకర సంఘటనల పరంపర

మహారాష్ట్రలోని ఈ జిల్లాకు చెందిన యువజనం తమ గ్రామాలలో చేయటానికి పనులేమీ లేకపోవటంతో బలవంతపు వలసల పాలవుతున్నారు. 2024 సాధారణ ఎన్నికల గురించిన ఆలోచనే వారి మనసులలో లేదు

ఏప్రిల్ 23, 2024 | జైదీప్ హర్దీకర్

పలామూ: రైతు గురించి పట్టించుకునేదెవరు?

ఝార్ఖండ్‌లోని ఈ జిల్లాలో వరుసగా వచ్చిపడిన కరవుల కారణంగా చేసిన అప్పుల ఊబిలో చిన్న, సన్నకారు రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. నీటిపారుదల సౌకర్యానికే తమ ఓటని వారు చెప్తున్నారు

ఏప్రిల్ 17, 2024 | అశ్విని కుమార్ శుక్లా

భండారా యువత: బ్యాలెట్ కన్నా ఉద్యోగాలకే ప్రాధాన్యం

2024 భారతదేశ సార్వత్రిక ఎన్నికల మొదటి దశలో భాగంగా ఏప్రిల్ 19న భండారా-గోందియా పార్లమెంటరీ నియోజకవర్గంలో ఎన్నికలు జరుగుతాయి. అయితే యిక్కడి శివాజీ స్టేడియంలో మాత్రం, నిరుద్యోగం కారణంగా ఆందోళన చెందుతున్న యువత, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం శిక్షణ తీసుకోవడంలో మునిగి ఉంది. వారికి ఇదే మొదటి ప్రాధాన్యం. ఈ గ్రామీణ యువతకు ఎన్నికల వాగ్దానాలు చాలా దూరంలో ఉన్నాయి. ఈనాటి ఈ కథనంతో PARI సిరీస్‌ - రూరల్ బ్యాలెట్ 2024ను ప్రారంభిస్తున్నాం

ఏప్రిల్ 12, 2024 | జైదీప్ హర్దీకర్

పుసేసావళిలో జీవితాలను నాశనం చేస్తోన్న ఘోరమైన పుకార్లు, ప్రచారం

మహారాష్ట్రలో, మెజారిటీ హిందుత్వ మూకలు మతపరమైన అల్లర్లను రెచ్చగొడుతున్నాయి. ఇందుకోసం ఆ మూకలు ఫొటోషాప్ చేసిన చిత్రాలు, ఎడిట్ చేసిన వీడియోలు, పుకార్లలాంటి వాటిని ఉపయోగించుకొంటున్నాయి. ఫలితంగా ముస్లిముల జీవితాలకు, ఆస్తులకు నష్టం వాటిల్లుతోంది

మార్చ్ 27, 2024 | పార్థ్ ఎమ్.ఎన్.
Translator : PARI Translations, Telugu