గుజరాత్‌లోని బనాస్‌కాంఠా జిల్లాలోని అనేకమంది రైతుల మాదిరిగానే, భానుబెన్ భర్వాడ్ 2017లో వచ్చిన వరదల కారణంగా తన భూమిని కోల్పోయారు. దీనితోపాటు పదే పదే మారుతూ వచ్చిన వాతావరణ సంఘటనలు ఆమె కుటుంబాల వంటి కుటుంబాలకు ఆహార భద్రతనూ, పోషకాహారాన్నీ అందకుండా చేశాయి.