"ఈ చట్టం ఉద్దేశించిన నియమాలు లేదా ఆదేశాల ప్రకారం, ఏదైనా చట్టాన్ని అములుచేసే ఉద్దేశంతో చేయదలచిన లేక చేయడానికి ఉద్దేశించిన ఏ విషయంలోనైనా కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం, లేదా వాటికి సంబంధించిన అధికారి లేదా ఇతర వ్యక్తుల పై ఎటువంటి దావా, ప్రాసిక్యూషన్ లేదా ఇతర చట్టపరమైన చర్యలు ఉండవు. ”
ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) చట్టం, 2020 లోని సెక్షన్ 13 కు స్వాగతం (ఇది వ్యవసాయ ఉత్పత్తి మార్కెటింగ్ కమిటీలను అరికట్టడానికి ఉద్దేశించినది, దీనిని ఎపిఎంసిలుగా పిలుస్తారు).
కొత్త చట్టాలు రైతుల గురించి మాత్రమే అని మీరు అనుకున్నారా? ఖచ్చితంగా. సివిల్ సర్వెంట్లుగా పిలవబడే పౌర సేవకులు వారి విధులను నిర్వర్తిస్తున్నప్పుడు, వారి పై విచారణను మినహాయించే ఇతర చట్టాలు కూడా ఉన్నాయి. కానీ దీనివలన ‘విశ్వాసంతో లేక మంచి ఉద్దేశంతో’ వారు ఏపని చేసినా, వారికి ఉండే రక్షణ వలన ఈ చట్టం స్పష్టతను కోల్పోతుంది. ఎందుకంటే ఈ చట్టం వలన వారు చట్ట పరిధి’లో చేసిన నేరాలు కోర్ట్ వరకు రాకపోవడమే కాక, వారు ముందు ముందు చట్ట పరిధి’లో చేయగలిగే నేరాలకు కూడా ఏ విధమైన చర్యా తీసుకోబడదు.
ఒకవేళ ఈ విషయాన్ని విస్మరించినట్లైతే - సెక్షన్ 15 ప్రకారం మీకు న్యాయస్థానాలలో చట్టపరమైన సహాయం లేదు. :
"ఏ విషయానికైనా ఎటువంటి దావా లేదా చర్యలను చేపట్టడానికి ఏ సివిల్ కోర్టుకు అధికార పరిధి ఉండదు, ఈ చట్టం ద్వారా లేదా దానికి లోబడి దాని ద్వారా రూపొందించబడిన నిబంధనల ద్వారా అధికారం పొందిన ఏ అధికారి పై దావా అయినా సరే బుట్టదాఖలు చేయవచ్చు."
చట్టబద్ధంగా సవాలు చేయలేని ‘మంచి విశ్వాసంతో లేక ఉద్దేశం తో’ పనులు చేసే ఇతర వ్యక్తులు’ ఎవరు? సూచన: నిరసన తెలిపే రైతులు జపిస్తున్న కార్పొరేట్ దిగ్గజాల పేర్లు వినడానికి ప్రయత్నించండి. ఇదంతా వ్యాపార సౌలభ్యం గురించి - చాలా పెద్ద వ్యాపారం అన్నమాట.
"ఎటువంటి దావా, ప్రాసిక్యూషన్ లేదా ఇతర చట్టపరమైన చర్యలు అబద్ధం కాదు ...." ఇక్కడ దావా వేయలేనిది రైతులు మాత్రమే కాదు. మరెవరూ వేయలేరు. ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి కూడా వర్తిస్తుంది. లాభాపేక్షలేని సమూహాలు, లేదా వ్యవసాయ సంఘాలు లేదా ఎవరైనా పౌరుడు (చట్టాన్ని అనుసరించి లేక అనుసరించకుండా నడిచేవారు) జోక్యం చేసుకోలేరు.
1975-77 యొక్క అత్యవసర పరిస్థితుల(అన్ని ప్రాథమిక హక్కులను నిలిపివేసినప్పుడు)లోనే కాక, ఏ సమయం లోనైనా చట్టపరమైన సహాయాన్ని పొందే పౌరుడి హక్కును నిలిపివేసే అధిక మినహాయింపులలో ఈ చట్టాలు ఖచ్చితంగా ఉన్నాయి







