అతను ఆమెను 'అమ్మా' అని పిలుస్తాడు, కానీ సంజీవని అసుంత కొడుకు కాదు.
ధరమ్‌జైగఢ్ బ్లాక్‌లోని మిరిగుడాలో ఉన్న ఆరోగ్య ఉప కేంద్రంలో అసుంత టొప్పో, సుమారు రెండు దశాబ్దాలుగా గ్రామీణ ఆరోగ్య నిర్వాహకురాలి (ఆర్ఎచ్ఒ)గా పనిచేస్తున్నారు. కొన్నేళ్ళ క్రితం ఆమె ఒక అత్యంత ప్రమాదకరమైన పురుడు పోసే బాధ్యతను తీసుకోవాల్సివచ్చింది. తల్లి అధిక రక్తపోటుతోనూ రక్తహీనతతోనూ బాధపడుతోంది. ఆమె హెమోగ్లోబిన్ ఏడు గ్రాముల కంటే తక్కువగా ఉంది. "మా ఆరోగ్య ఉపకేంద్రానికి వచ్చే సమయానికే ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. మేమింకా ఆమెను బల్లమీదకు తీసుకు రాకముందే బిడ్డ పుట్టాడు," అసుంత గుర్తుచేసుకున్నారు.
స్థానికంగా ఉపస్వాస్థ్యకేంద్రంగా పిలిచే ఆరోగ్య ఉప కేంద్రంలో పుట్టినబిడ్డ పరిస్థితిఅంత మంచిగా లేదు. "మాకిక్కడ ఆక్సిజన్సౌకర్యం లేదు, తల్లి పరిస్థితికూడా విషమంగాఉంది," అంటూ గుర్తుచేసుకున్నారుఅసుంత. తల్లికితీవ్రంగా రక్తస్రావంఅవుతుండటంతో, ఆ ఆర్ఎచ్ఒకు బిడ్డ విషయం పట్టించుకోవాలో, తల్లి సంగతి చూడాలో అర్థంకాలేదు.
"మొదట మేం వాళ్ళని ధరమ్జైగఢ్కు తీసుకువెళ్ళాం. అక్కడ ఒక డాక్టర్ ఉంది, ఆమె పేరు చెప్పటం నాకు ఇష్టంలేదు. ఆమె తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, ఇంత క్లిష్ట పరిస్థితిలో ఉన్న తల్లీబిడ్డలను ఇక్కడికెందుకు తీసుకువచ్చారని మమ్మల్ని అడిగింది," ఆమె గుర్తుచేసుకున్నారు. కానీ అసుంత ఆ డాక్టర్‌తో దెబ్బలాడారు. "మీకు చేతకాకపోతే వదిలెయ్యమని నేనామెకు చెప్పాను. కొద్దిగా సహాయం చేయమని అడిగాను. ఆమెకు కోపం వచ్చింది."
అసుంత బిడ్డను పైకెత్తి పట్టుకొని ఆంబులెన్స్ కోసం అడిగారు. ఇంతలో ఆ డాక్టర్ దయతలచి ఒక ఇంజెక్షన్ ఇచ్చారు. తనతో పాటు వచ్చిన మితానిన్ (గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్త - ఆశా) తన నోటి నుండి బిడ్డ నోటిలోకి ఊపిరిని ఊదటం ద్వారా బిడ్డను బతికించడానికి ప్రయత్నం చేస్తూ ఎంతో సహాయపడిందని అసుంత చెప్పారు.











