కులంతో ముడిపడి ఉన్న సాహితీప్రక్రియ అయిన రాజా రాణి ఆట్టం రంగస్థలంపై తన పాత్రను పోషించడానికి పి. సెన్రాయపెరుమాళ్ బడి మానేయాల్సి వచ్చింది. నిరంతర నిందలు, లైంగిక వేధింపులు, సంప్రదాయ భారాన్ని మోస్తూ ఆయన, ఆయన సోదరులు తమ బాల్యాన్ని స్త్రీ పాత్రలు పోషిస్తూ గడిపారు.
రాత్రివేళల్లో నృత్యం చేస్తూ జీవిస్తూనే, 23 ఏళ్ళ వయసులో, అతను తనంతట తానుగా తిరిగి చదువుకునే అసాధ్యమైన ప్రయత్నం చేశారు. ఒక పద్ధతి ప్రకారం అతనికి నిరాకరించబడిన విద్యను తిరిగి సాధించారు. దేశంలో ఉన్నత విద్య ఇచ్చే వాగ్దానంపై విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూనే, ఆయన తాను అభ్యసిస్తోన్న జానపద సంప్రదాయంపై పిఎచ్డి పొందారు. అతని విషయంలో, ఆ విశ్వాసం విషాదకరంగా కొద్దికాలం మాత్రమే నిలిచింది.


