"మేం మా ఆదివాసీ ఆహారాన్ని మర్చిపోయాం," అంటారు యవత్మాళ్ నివాసి చందా ఘోడమ్.
గ్రామీణ భారతదేశంలో 75 శాతానికి పైగా మహిళలు వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నారు. కానీ చాలా కొద్దిమందికి మాత్రమే సొంత భూమి, పశువులు ఉన్నాయి; సహజ వనరులపై హక్కునూ పొందగలుగుతున్నారు. ఆహార ఉత్పత్తిలోనూ, జీవవైవిధ్యాన్ని రక్షించటంలోనూ మహిళలే కేంద్రస్థానంలో ఉన్నప్పటికీ, సామాజిక నిర్మాణాలు వారంతట వారిని రైతులుగా గుర్తించటంలేదు.
మహారాష్ట్రలోని కరవుల వలన, వ్యవసాయ సంక్షోభం వలన జరిగిన ఆత్మహత్యలతో ప్రభావితమైన ప్రాంతాలైన మరాఠ్వాడా, విదర్భలలో ఎన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ చందా, ఇంకా ఇతర మహిళా రైతులు వ్యవసాయంలో నిశ్శబ్ద విప్లవానికి నాయకత్వం వహిస్తున్నారు; వారి సంప్రదాయ ఆహారానికి తిరిగి వస్తున్నారు.
"మన భూమిలో దేన్నైనా పండించగలమని నేను ఇతర మహిళలకు చెబుతుంటాను," నవ్వుతూ చెప్పారు చందా.


