"తాము ఏరుకొన్న చెక్కముక్కలను ఇప్పుడెవరూ అమ్ముకోరు," అన్నారురుబీనా బీబీ. "వాటిని వాళ్ళు తమసొంత చూల్హా [పొయ్యి]ల్లోకి వంటచెరుకుకోసం ఉంచుకుంటారు." ఆమె తన ఝుగ్గీ (తాత్కాలిక నివాసం) బయటకూర్చొని, ఒకప్పుడుతలుపుగా ఉన్న ఒకచెక్క పలకను ముక్కలుచేస్తున్నారు.
ఐదుగురున్నతన కుటుంబానికి, " యహ్ దోలగ్ జాయేంగే [ఇలాంటిరెండు చెక్క పలకలుకావాలి]," అన్నారురుబీనా. ఫిబ్రవరి 2026లో ఇరాన్పైఅమెరికా-ఇజ్రాయెల్‌ల యుద్ధం మొదలైనప్పటినుంచి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ [ఎల్పిజి] ధరలుభారీగా పెరిగిపోయాయి. రెండు కిలోగ్రాముల సిలిండర్ ధర ఇప్పుడురూ. 440 నుంచి 500 వరకూ ఉంది. ఇదియుద్ధం మొదలవ్వక ముందువారు నల్ల బజారులోకొన్నప్పటి ధరకంటే రెట్టింపుకన్నా ఎక్కువ.
చెత్తఏరుకునే ఈ కుటుంబానికి, వంట చేసుకోవడానికి చెక్క ముక్కలు ఇప్పుడుఎంతో అవసరం. " మేంవారానికి ఐదు కిలోలవరకు సేకరించగలుగుతాం, లేదా కిలో ఐదురూపాయల చొప్పున చెక్కనుకొనుగోలు చేస్తాం," రుబీనా చెబుతున్నారు.
రుబీనావాయవ్య దిల్లీలోని భలస్వా ప్రాంతంలో చెత్త ఏరుకునేవారి సముదాయంలో నివసిస్తున్నారు. ఇక్కడ నివాసముండేవారిలో దాదాపు అందరూ పశ్చిమబెంగాల్లోని పశ్చిమమేదినీపూర్ జిల్లా నుండివలస వచ్చిన మొదటి, రెండవ తరంవారే. వారంతామూడు నుండి నాలుగుఅంతస్తుల ఎత్తులో కొండలాపేరుకుపోయిన చెత్త పక్కనేనివసిస్తున్నారు. పురుషులువీధుల్లో, ఇళ్ళల్లో, మున్సిపాలిటీ డంప్ చేసేప్రదేశాల నుండి చెత్తనుసేకరిస్తారు. మహిళలుప్లాస్టిక్ సీసాలు, సంచులు, రబ్బరు, గాజు, థర్మోకోల్ వంటి వస్తువులనుఆ చెత్త నుండివేరుచేసి, వాటినిస్క్రాప్ డీలర్లకు అమ్ముతారు.














