వాగ్దానం చేసిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం మాకు ఉద్యోగాలివ్వాలి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రభుత్వం రైతుల పొలాలను స్వాధీనం చేసుకోవడం ఫలితంగా చాలామంది గ్రామీణ వ్యవసాయదారులు తమ పొలాలనే కాక, పంటలను కూడా నష్టపోయారు. యువకులు తప్పని పరిస్థితులలో కృష్ణానది వద్ద జరుగుతున్న ఇసుక క్వారీల పనుల్లోకి కార్మికులుగా వెళ్ళవలసివస్తోంది. ఇక మహిళలైతే పూర్తిగా నిరుద్యోగులైపోయారు