వడిసెలలు, రైఫిళ్ళు చేతబట్టిన మల్లు స్వరాజ్యం నేతృత్వంలోని దళాలు, 1940ల కాలంలో వరంగల్లు ప్రాంతంలోని నిజామ్ మిలీషియాలో భయోత్పాతాన్ని రేకెత్తించాయి. 2022 మార్చిలో మరణించే వరకు, ఈ స్వాతంత్ర్య సమరయోధురాలు అన్యాయానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలని ఉద్బోధిస్తూనేవచ్చారు