ఆంధ్ర ప్రదేశ్లో రైతులు లక్షలాది రూపాయల అప్పులు, పెట్టుబడుల తర్వాత మార్కెట్ యార్డులో అతి తక్కువ ధరలకు మాత్రమే కొనుగోళ్ళు జరిగేలా చూసే కమీషన్ ఏజెంట్ల కూటముల బారిన పడుతున్నారు. అమ్మకాలను డిజిటీకరణ చేసేందుకు ప్రభుత్వం చేసే ప్రయత్నాలు ఈ పరిస్థితిని ఏ మాత్రం మెరుగుపరచడం లేదు.