తమిళనాడులోని విరుదాచలంలో ఉండే బంకమన్ను కళాకారులు పింగాణీ బొమ్మలను, మట్టి దీపాలను తయారుచేస్తారు. అయితే, అంతకుముందులా ఈ పని వాళ్ళకు స్థిరమైన ఆదాయాన్నీ, తగిన గుర్తింపునూ తీసుకురావడం లేదు. అయినప్పటికీ, ఇక్కడి కళాకారులు ఇదే వృత్తిలో కొనసాగుతున్నారు. వాళ్ళ చేతులు మట్టి నుండి కళాత్మక వస్తువులను సృష్టిస్తూనే ఉన్నాయి
ఎమ్. పళని కుమార్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో స్టాఫ్ ఫోటోగ్రాఫర్. శ్రామికవర్గ మహిళల జీవితాలనూ, అట్టడుగు వర్గాల ప్రజల జీవితాలనూ డాక్యుమెంట్ చేయడంలో ఆయనకు ఆసక్తి ఉంది.
యాంప్లిఫై గ్రాంట్‌ను 2021లోనూ, సమ్యక్ దృష్టి, ఫోటో సౌత్ ఏసియా గ్రాంట్‌ను 2020లోనూ పళని అందుకున్నారు. ఆయన 2022లో మొదటి దయానితా సింగ్-PARI డాక్యుమెంటరీ ఫోటోగ్రఫీ అవార్డును అందుకున్నారు. తమిళనాడులో అమలులో ఉన్న మాన్యువల్ స్కావెంజింగ్ పద్ధతిని బహిర్గతం చేసిన 'కక్కూస్' (మరుగుదొడ్డి) అనే తమిళ భాషా డాక్యుమెంటరీ చిత్రానికి పళని సినిమాటోగ్రాఫర్‌గా కూడా పనిచేశారు.
See more stories
Translator
Y. Krishna Jyothi
కృష్ణ జ్యోతికి సబ్ ఎడిటర్ గా, ఫీచర్స్ రైటర్ గా పన్నెండేళ్ల అనుభవం ఉంది. ఇప్పుడు ఆమె ఒక బ్లాగర్.